బిగ్‌బాస్ హౌస్ వెలుపల బాణసంచాతో కౌశల్ ఆర్మీ సందడి!

  • కౌశల్‌కి విపరీతంగా పెరిగిపోయిన సానుభూతి
  • హైదరాబాద్, విజయవాడల్లో 2కె వాక్
  • కౌశల్ కూతురి పుట్టినరోజు సందర్భంగా హడావుడి
బిగ్‌బాస్ సీజన్-1 కన్నా ఇప్పుడు సీజన్-2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందుతోంది. దీనికి కారణం కౌశల్. అతనికి హౌస్‌మేట్స్ అంతా వ్యతిరేకమవడంతో హౌస్ వెలుపల సానుభూతి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కౌశల్ ఆర్మీ ఏర్పడింది. ఈ ఆర్మీ బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్నదంతా జాగ్రత్తగా గమనిస్తూ కౌశల్‌కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారిని వంతుల వారీగా బయటకు పంపిస్తోంది. ఇటీవల హైదరాబాద్, విజయవాడల్లో 2కె వాక్ నిర్వహించి హాట్ టాపిక్ అయింది.

కాగా, నిన్న కౌశల్ కూతురు లల్లీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కౌశల్ ఆర్మీ సభ్యులు ఆయన ఇంటికి వెళ్లి ఆ చిన్నారితో కేక్ కట్ చేయించడమే కాదు... బిగ్‌బాస్ హౌస్ వెలుపల బాణసంచా కాల్చి హడావుడి చేశారు. అర్థరాత్రి 12గంటల నుంచి కొన్ని గంటలపాటు బాణాసంచా కాల్చినట్టు కౌశల్ ఆర్మీ సభ్యులు కొందరు తెలిపారు. కౌశల్ స్నేహితుడు నూతన్ నాయుడు కూడా కౌశల్ ఇంటికి వెళ్లి లల్లీకి బహుమతి ఇచ్చి, విషెస్ చెప్పినప్పటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.
Go Back to Shorts
koushal
nuthan naidu
big boss house
lally

More Telugu News